సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మ దిన వేడుకలు భీమవరం పట్టణంలో పలు కాలేజీలు విద్యాసంస్థల్లో ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా డి యన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాన్ యస్ యస్ యూనిట్ ఆధ్వర్యం లో ఇంజినీర్స్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వేచేసిన డి.అహమ్మద్ డివిజన్ ఇంజనీర్ వెస్ట్ గోదావరి మాట్లాడుతూ.. ఎక్కడయినా సరే ఇంజనీర్ లేనిదే.. అభివృద్ధే లేదు అని, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక సివిల్ ఇంజినీర్. విద్యావేత్త కూడా. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పాలక మండలి సభ్యుడిగా సేవలందించారు, తిరుమల కొండలలో రోడ్డు మార్గం వేయించిన మహానుభావుడు అన్నారు . ఆయన టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో పాలక మండలిలో సభ్యుడిగా నియమితులయ్యారు. మైసూర్ సోప్ ఫ్యాక్టరీని కూడా స్థాపించారు, మైసూర్ సంస్థానానికి దీవాన్‌గా కూడా పనిచేశారు. సర్ విశ్వేశ్వరయ్యకు 1955 లో భారత ప్రభుత్వం భారత్ రత్న అవార్డుతో సత్కరించింది. ఆయన రచనలుతో ఇప్పటికీ దేశాభివృద్ధికి కృషి చేస్తూనే ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి, గాధిరాజు బాబు, ప్రిన్సిపాల్ డా.ఎం.అంజన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ రత్నం, రంగ సాయి, లయన్ క్లబ్ ,నందమూరి రాజేష్ తదితరులు పాల్గొని శాలువలతో సత్కారాలు అందుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వి ప్రవీణ్ కళాశాల, విభాగాధిపతులు,కళాశాల డీన్లు,అధ్యాపక అద్యాపకేతర సిబ్బంది విద్యార్ధులు పాల్గొనారు.
