సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: స్వాతంత్ర సమరయోదుడు, మాజీ శాసన సభ్యులు లేటు దంతులూరి నారాయణరాజు 125 వ జయంతి వేడుకలు లో DNR(దంతులూరి నారాయణరాజు కళాశాలలో) ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్బంగా కళాశాల ఆవరణలోని నారాయణరాజు విగ్రహానికి పాలకవర్గంతోపాటు అద్యాపక, అద్యాపకేతర సిబ్బంది పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ .. దంతులూరి నారాయణ రాజు గారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా కులమత వర్గాల కు అతీతంగా అన్ని వర్గాల వారికి కళాశాలలో నాణ్యమైన విద్యను అతి తక్కువ ఫీజులతో అందిస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ లాభ నష్ట రహిత ప్రాతిపతికన కళాశాలను నడిపిస్తున్నామని అన్నారు. కళాశాల పాలకవర్గ కార్యదర్శి మరియు కరస్పాండెంట్, గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) మాట్లాడుతూ.. దంతులూరి.. ఆశయాలకు అనుగుణంగా కేవలం సాంప్రదాయ కోర్సులే కాకుండా సాంకేతిక, ప్రొఫేషనల్ కోర్సులకు అదిక ప్రాదాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సంబందింత రంగాలలో వివిద కళాశాలలను ప్రారంబించడమైనదన్నారు. కళాశాలలో చదివే ప్రతీ విద్యార్దికి ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో పేరొందిన అనేక సంస్ధలతో ఒప్పందాలు కుదుర్చు కొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యస్.శాంతకుమారి మరియు DNR పాలకవర్గ సభ్యులు, అసోసియేషన్ ఆద్వర్యంలో నడుచుచున్న వివిధ విద్యాసంస్దల ప్రిన్సిపాల్స్ , అధ్యాపక మరియు అధ్యాపకేత సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
