సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవలే జాతీయ స్థాయి లో నాక్ వారిచే అత్యధిక గ్రేడ్ అయినా A++ గ్రేడ్ సాదించిన భీమవరంలో ప్రతిష్టాకర డి.యన్. ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో నేడు, మంగళవారం APEAPCET 2023 ఉచిత హెల్ప్ డెస్క్ ను డాక్టర్ జి. వి. వాణి రమణ రావు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు,చేతుల మీదుగా కళాశాలలో ప్రారంభిచారు. ఈ సందర్భంగా డా. జి. వి. వాణి రమణరావు మాట్లాడుతూ.. విద్యార్థులు తమకు సరైన అవగాహన లేని కారణంగా కౌన్సిలింగ్ లో సీట్ కోల్పోయిన సంఘటనలు మనందరికీ తెలుసునని, అలా కాకుండా విద్యార్థులకు సరైన అవహగాహన కల్పిస్తూ ఐచ్చికాలను నమోదు చేసుకొనే సదుపాయం కల్పించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. నిస్వార్ధంగా విద్యార్థుల అభ్యున్నతి కొరకు డి. యన్. ఆర్. అద్యకులు. గోకరాజు వెంకట నరసింహరాజు సారథ్యంలో పని చేస్తున్నపాలకవర్గాన్ని అభినందించారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు. సత్యనారాయణ రాజు (బాబు) మాట్లాడుతూ.. గత సంవత్సరం విద్యార్దులు ఇంటర్నెట్ కేంద్రాలకు వెళ్ళి లేదా మొబైల్ ఫోన్ ద్వారా EAPCET ఐచ్చికాలను సరిగా ఎంపిక చేసుకోకపోవడం వల్ల విద్యార్దులు చాలా ఇబ్బందులకు గురి అయ్యారని అందువల్ల విద్దార్థుల సౌకర్యార్ధం తమకు నచ్చిన కళాశాలను వారే ఎంపిక చేసుకొనే విదంగా హై స్పీడ్ ఇంటర్నెట్ తో ఈ ఉచిత హెల్ప్ లైన్ కేంద్రంలో సదుపాయం కల్పించి విద్యార్దులకు వారు తల్లిదండ్రులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక సిబ్బందితో ప్రతేకం గా 30 కంప్యూటర్లతో ఒక ల్యాబ్ ను సిద్ధం చేశామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. యం. అంజన్ కుమార్ మాట్లాడుతూ.. ఈ హెల్ప్ డెస్క్ లో డా. జి. జి. రత్నం కళాశాల అడ్మిషన్ కన్వీనర్ పరవేక్షణలో విద్యార్దులకు సహకరించడానికి నిపుణులైన సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని EAPCET కౌన్సెలింగ్ సంభందించ ఎటువంటి సందేహాలయిన ఈ క్రింది నెంబర్ కు 9247848665 సంప్రదించవలసిందిగా కోరారు
