సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం డి.ఎన్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నేడు,సోమవారం “కెరియర్ గైడెన్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్’ అనే అంశం పై సెమినార్ నిర్వహించామని కళాశాల ప్రెసిడెంట్ గోకరాజు వెంకటనరసింహరాజు మరియు కళాశాల సెక్రటరీ అండ్ కార్సపాండెంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు)తెలిపారు. ఈ సెమినార్లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎమ్. అంజన్ కుమార్ గారు మాట్లాడుతూ యువ ఇంజనీర్ల నైపుణ్యాన్ని ఎలా సంతరించుకోవాలో విద్యార్థులకు తెలియ జేసారు. ఈ సదస్సులో ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్. సుధాకర్ వారణాసి , సి.ఏ.ఓ అఫ్ విసిఒన్ కంపాస్ ఇన్ సీటెల్,యూ.స్.ఏ మరియు 108 అత్యవసర వైద్యసేవల అంబులెన్స్ రూపకర్త విద్యార్థులను ఉద్దేసించి మాట్లాడుతూ.. విద్యార్థి జీవితాల్లో ప్రగతిని సాధించాలంటే నేర్చుకోవటం ముఖ్యమని తెలియచేస్తు విద్యార్థులలో సాంకేతిక నైపుణ్యం వల్ల కొన్ని కొత్త పోకడలకు శ్రీకారం చుట్టాలని వివరించారు. ఈ సెమినార్ లో కళాశాల జాయింట్ సెక్రటరీ కే. రామకృష్ణం రాజు గారు, వైస్ ప్రిన్సిపాల్ బి.వీ. ఎస్.వర్మ ,అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
