సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం స్థానిక డి.యన్.ఆర్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కళాశాలలో జాతీయ సేవ సమితి ఆవిర్బావ దినోత్సవం (సెప్టెంబర్ 24 వ) తేదిని పురస్కారించుకొని కళాశాల N S S యూనిట్ అధ్వర్యంలో A S N రాజు ఛారిటబుల్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన్ అమృత్ మహోత్సవ్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో సుమారు 120 మందికి పరిక్షలు నిర్వహించి 80 మంది రక్తదానం చేశారు. అంతే కాకుండా పాలిటెక్నిక్ ప్రధమ సంవత్సరం విద్యార్ధులకు 170 మందికి రక్త గ్రూపులను నిర్ధారించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ Dr. M. అంజన్ కుమార్ మాట్లాడుతూ .. రక్తదానం…. మహాదానం.. ప్రాణదానం తో సమానమని అన్నారు. ప్రతి విద్యార్ధి సామజిక సేవలో పాలుపంచుకోవాలని అయన విద్యార్ధులకు పిలుపు ఇచ్చారు. రక్తదానం చేసిన మా విద్యార్ధులంతా ప్రాణదాతలే అని విధ్యార్ధులను అభినందిచారు ఈ రక్తదాన శిభిరాల నుండి సేకరించిన రక్తాని తలస్లేమియా భాదితులకు కాన్సర్ రోగులకు ప్రమాదాలు గురైనా క్షతగ్రతులకు ఈ రక్తాని ఉపయోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం N S S OFFICER వి. ప్రవీణ్ నేతృత్వం లో జరిగింది.
