సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డీ.ఎన్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం బి.టెక్ విద్యార్థులు Dyashin Technosoft Pvt. Ltd. నిర్వహించిన ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో వార్షిక వేతనము రూ. 4 లక్షలు గా ల జూనియర్ ఇంజనీర్ హోదా కు 7 మంది క్యాంపస్ విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. అంజన్ కుమార్ తెలిపారు.. కళాశాల ప్రెసిడెంట్, జి.వి. నరసింహరాజు మాట్లాడుతూ..ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, “ఇలాంటి విజయాలు విద్యార్థుల కృషి మరియు కళాశాల నాణ్యమైన బోధనకు నిదర్శనం” అని అన్నారు. కళాశాల కార్యదర్శి, గాదిరాజు సత్యనారాయణ రాజు బాబు మాట్లాడుతూ, “మన కళాశాల విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ ప్రతిభను నిరూపించుకోవడం ఎంతో గర్వకారణం. డ్యాషిన్ టెక్నోసాఫ్ట్ వంటి సంస్థలో విద్యార్థుల ఎంపిక మా విద్యా ప్రమాణాలకు నిదర్శనం” అని తెలిపారు కళాశాల వైస్ ప్రెసిడెంట్, పాండురంగ రాజు మాట్లాడుతూ, “విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాము” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *