సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం D N R కళాశాలలో ఈ విద్యాసంవత్సరం(2024-25)లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే విద్యార్థులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందితో ఉన్నా మరియు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన వారి ఇంజనీరింగ్ విద్యకు ఫీజుతో ఆటంకం లేకుండా దాతల సహకారంతో ఆర్థిక ప్రోత్సహకాన్ని అందించాలనే ఉద్దేశంతో కళాశాల పాలక వర్గం కృషిచేస్తుంది. ఈ సందర్భంగా నేడు, గురువారం ఉదయం కళాశాల అధ్యక్షులు శ్రీ గోకరాజు నరసింహరాజు మరియు కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజుమాట్లాడుతూ.. ఇంజనీరింగ్ జాయిన్ అగుటకు ఆసక్తి ఉండి ఫీజులు కట్టుకొని విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి ఆర్థిక భరోసానిస్తూ దాతలు కొత్తశ్రీనివాస్.. పేద మరియు ప్రతిభావంతులైన 20 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. ధాత.. కొత్తశ్రీనివాస్ గారు మాట్లాడుతూ dnr ఇంజనీరింగ్ కళాశాల లో చేరిన విద్యార్థులలో గత 5 సంవత్సరాలు గా ప్రతిభ వంతులైన పేద మరియు మధ్యతరగితికి చెందిన విద్యార్థులకు వారియిక్క ఉన్నత విద్యకు ఆర్ధిక చేయూతను అందిస్తూ రెండు లక్షల రూపాయలను చేయూతగా అందిస్తున్నామని అన్నారు. తమ దాతృత్వాన్ని పొందిన విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందారని తెలిసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి స్థాయిని పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. యం. అంజన్ కుమార్ మాట్లాడుతూ,.. భీమవరం పరిసర ప్రాంత విద్యార్థులు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చి ప్రిన్సిపాల్ ఆఫీసులో సంప్రదించవచ్చని .. దాతలకు విద్యార్థుల తరపున మరియు వారి తల్లిదండ్రుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కారుమూరి సత్యనారాయణ తటవర్తి బదిరి కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
