సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో స్దానిక డి.యన్.ఆర్ కళాశాలలో నేడు, మంగళవారం అనగా మార్చి 24వ తేదీన ఆశ్రం హాస్పిటల్, ఏలూరు వారి సౌజన్యంతో విద్యార్థులు, సిబ్బంది మరియు స్థానికుల కోసం కళాశాల ఆవరణలో ఘనంగా “ఉచిత మెగా వైద్య శిబిరం” నిర్వహించబడినదని కళాశాల ప్రిన్సిపాల్ జి.మోజెస్ తెలిపారు. ఈ నెల 27 న కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు గారి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామన్నారు.ఈ సందర్బంగా గోకరాజు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ .. తమ కళాశాలలో సమాజ సేవలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండి నిర్వహిస్తామని అన్నారు. విద్యతో పాటు ఆరోగ్యం కూడా సమానంగా ముఖ్యమని, విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ , గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) , కళాశాల ఉపాద్యక్షులు, గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు ప్రతీ సంపత్సరం నిర్వహిస్తామని పేర్కొన్నారు వ్యాధి వచ్చాక బాధపడటం కంటే, రాకముందే నివారించడం ఉత్తమమని, ఇటువంటి వైద్య శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *