సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోదశాబ్దాలుగా ప్రతిష్టాత్మక కాలేజీగా ప్రసిద్ధి పొందిన దంతులూరి నారాయణరాజు కళాశాలలో ఈ రోజు పోస్టు గ్రాడ్యుయేషన్ (పి.జి) పరీక్ష ఫలితాలను కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు మరియు సెక్రటరీ మరియు కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) విడుదల చేసారు. ఈ రోజు శుక్రవారం విడుదల చేసిన పి.జి పరీక్ష ఫలితాలలో 322 మంది హాజరు కాగా 279 మంది ఉత్తీర్ణత( 87 శాతం) సాధించారు. అక్టోబర్ 25 వ తేదీ నుండి అక్టోబర్ 29 తేదీ వరకూ రీ వాల్యూషన్ అప్లికేషన్లు ఇవ్వబడునని, అర్హత కలిగిన విద్యార్దినీ విద్యార్దులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తమ కళాశాల లో ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టి నేటి టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్దులను తర్పీదు ఇచ్చి వారికి తగిన అర్హత కలిగిన ఉద్యోగాలు కల్పించానికి కృషిచేస్తున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరం నుండి యమ్.యస్.సి అక్యాకల్టర్ టెక్నాలజీ కోర్సును ప్రారంబింస్తున్నామని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జి.మోజెస్ మాట్లాడుతూ.. నేడు మన రాష్ట్రంలోనే అదిక సంఖ్యలో విద్యార్ధులు గల కళాశాలలలో దంతులూరి నారాయణరాజు కళాశాల ఒకటని, కొన్ని లక్షల మంది విద్యార్ధులకు ఉపాది అవకాశాలు పొందే విధంగా విద్యను అందించిన ఘనత డీఎన్ ఆర్ కు చెందుతుందన్నారు. . పరీక్ష ఫలితాలు కళాశాల వెబ్ సైట్ www.dnrcollege.org, www.dnrstudent.com లో అందుబాటులో ఉంచామని అన్నారు. అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ పి.రామకృష్ణంరాజూ పాల్గొన్నారు.
