సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డి.యన్.ఆర్ కళాశాల, లైబ్రరీ అవరణలో రేపు శుక్రవారం (ది. 14-07-2023 వ తేది) ఉదయం 9:00 గంటల నుండి ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనదని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సి.హెచ్.జె.సోమరాజు తెలిపారు. ఈ సందర్బంగా కళాశాల పాలక వర్గ అధ్యక్ష మరియు కార్యదర్సులు, గోకరాజు వెంకట నరసింహరాజు మరియు గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) మాట్లాడుతూ..డి.యన్.ఆర్ అసోసియేషన్ లోని విద్యా సంస్థల ద్వారా విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించడంతో సమాజిక సేవ చేయాలనే తలంపుతో సంస్దాగతమైన సామాజిక భాద్యతగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆశ్రం హాస్పటల్స్, ఏలూరు వారి సౌజన్యంతో డి.యన్.ఆర్ కళాశాల లైబ్రరీ హాలులో ఏర్పాటుచేయడమైనదిని అన్నారు. కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండు రంగరాజు మాట్లాడుతూ .. ఈ ఉచిత వైద్య శిబిరంలో. కార్డియాలజి, డెర్మటాలజీ, ఎండ్రోక్విలాజి, జనరల్ సర్జరీ , జనరల్ మెడిసన్ , కంటి సంబంధిత వ్యాధులు, కాటరాక్ట్ సర్జరీ, చెవి,ముక్కు, గొంతు , ఆర్దోపేటిక్, ధైరాయిడ్ మొదలగు స్పెషలైజేషన్స్ లలో ఉచిత వైద్య సేవలు,ఉచిత మందులు అందివ్వబడును అని తెలిపారు.
