సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశానికీ ఎందరో మహానుభావులను పారిశ్రామిక విద్య వేత్తలను , ఉన్నత న్యాయమూర్తులు, ఐ.ఎ.యస్, ఐ.పి.యస్ లు కళాకారులను అందించిన .. భీమవరంలో దశాబ్దాలుగా ఖ్యాతి గాంచిన స్దానిక దంతులూరి నారాయణరాజు కళాశాలో ఈ నెల 30 వ తారీకున పూర్వవిద్యార్దుల సమావేశం ఏర్పాటు చేయటమైనదని DNR పాలక వర్గ వైస్ ప్రసిడెంట్ గోకరాజు పాండురంగ రాజు మన సిగ్మా న్యూస్ కు తెలియజేసారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రులు నిమ్మల రామానాయుడు, మంత్రి దుర్గేష్ లు ప్రధాన అతిధులుగా హాజరు కానున్నారని, పెద్ద సంఖ్యలో కళాశాల పూర్వ విద్యార్దులు, ఇదే విద్య సంస్థలలో చదువుకొన్న ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.ఈ ఆగస్టు నెల 30వ తేదీ స్థానిక DNRకాలేజీ గ్రౌండ్స్ వద్ద ఉన్న శ్రీ రామకృష్ణ సభ మండపంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1-30 ని.. వరకు కార్యక్రమం జరుగుతుందని పూర్వ విద్యార్థులు ఇదే ఆహ్వానంగా భావించి రావాలని మంచి అనుభూతి పంచుకోవాలని పిలుపు నిచ్చారు.
