సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో దశాబ్దాలుగా ప్రతిష్టాకర కాలేజీగా ప్రసిద్ధి పొందిన భీమవరం DNR విద్యాసంస్థల పాలకవర్గ కార్యదర్శి గా ప్రస్తుతం కొనసాగుతున్న గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) 2023 – 2028 కాలానికి గాను త్వరలో జరగనున్న ఎన్నికలకు మరోసారి కార్యదర్శి స్థానానికి రెండు సెట్ల నామినేషన్ పాత్రలను ఎన్నికల అధికారి డా K రఘురాం కి దాఖలు చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అధ్యక్షులుగోకరాజు వెంకట నరసింహ రాజు నాయకత్వంలో సహచర పాలకవర్గ సభ్యుల సహాయ సహకారాలతో కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేశానని తెలిపారు. తనకు అన్ని రకాలు గా సహాయ సహకారాలు అందించిన అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియచేసారు. కాలేజీ మహాజన సభ్యులు ఆశీర్వదించి మరొక అవకాశం కల్పిస్తే కళాశాల అభివృద్ధికి తనవంతు మరింత కృషి చేస్తాను అని అన్నారు.
