సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం దంతులూరి నారయణరాజు కళాశాల అవరణలో నూతనంగా నిర్మించిన క్యాంటిన్ ను కళాశాల అద్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు నేడు, సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా అద్యక్ష కార్యదర్సులు గోకరాజు వెంకట నరసింహరాజు మరియు గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) మాట్లాడుతూ.. విద్యార్దులు సౌకర్యార్దం వారికీ అతి సామాన్య ధరలలో.. కళాశాలలో అత్యంత సుందరంగా ఈ క్యాంటిన్ ను ఏర్పాటు చేయడమైనదిని తెలిపారు. విద్యార్దులే కాకుండా డి.యన్.ఆర్ వాకర్స్ ఉదయం మరియు సాయంత్రం సమయంలో ఈ క్యాంటిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేషన్ పాలకవర్గ సభ్యులు, డీ ఎన్ ఆర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు , విద్యార్దులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కళాశాలలో విద్యాలో ప్రతిభ కలిగిన విద్యార్దులను అభినందిస్తూ వారికీ ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసారు.
