సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం దంతులూరి నారాయణరాజు కళాశాల గణితశాస్త్రం విభాగం అద్వర్యం లో జులై 11, 2023 వ తేదీన “Role of Mathematics in science and Engineering” అనే అంశంపై ఆచార్య. V. వాసుదేవ మూర్తి (S.R.K.R ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం) చే అతిధి ఉపన్యాసం నిర్వహించడం జరిగింది. వారు ఈ అంశంపై మట్లాడుతూ.. గణితశాస్త్రం ప్రకృతిలో, వంటింటిలో, ఆటలలో, ఆర్కిటెక్చర్లలో మాత్రమే కాక, ఇంజనీరింగ్ లోని అనేక శాఖలలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉందని, గణితశాస్త్రం ఇంజినీరింగ్కు తల్లి అని చెప్పారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, I.T ఇంజినీరింగ్ అర్థం చేసుకోవడానికి గణితం ఒక ప్రాధమిక సాధనము అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ Ch.సోమరాజు, A.O. పి. రామకృష్ణంరాజు, M.V.N భాస్కరరాజు, Dr. B. జ్యోతి, K.C. తమ్మి రాజు, V.రాజ శేఖర్, p. దుర్గా భవాని, M.S. శిరీష, G. భవాని మరియు విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు
