సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీ ఈఏపీసెట్ 2024 లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు కోసం కళాశాల ప్రవేశాల ఎంపిక కొరకు, కౌన్సిలింగ్ వివరణ కోసం హెల్ప్ డెస్క్ ను నేటి సోమవారం నుండి ప్రారంభించడం జరిగింది. కళాశాల ఆవరణలో ప్రత్యేక సిబ్బందితో హెల్ప్ డెస్క్ ను కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు మరియు కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భీమవరం మరియు పరిసర ప్రాంత విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ ద్వారా ఇంజనీరింగ్ కళాశాల ఆప్షన్ ల ఎంపిక కొరకు ఈ హెల్ప్ డెస్క్ ను పేద ,బడుగు, బలహీన మరియు అన్ని వర్గాల ఉపయోగార్ధం ఇటువంటి సేవలను ఉచితంగా వినియోగించుకోవాలని తెలిపారు. ప్రస్తుత ఇంటర్నెట్ సెంటర్ లో విద్యార్థులు తల్లీదండ్రులు వెబ్ ఆప్షన్ల ఎంపికలో పూర్తిగా మోసపోతున్నారని, తమకు నచ్చిన బ్రాంచ్ మరియు కళాశాల ఎంపిక చేసుకోవడంలో ఎలాంటి లోపాలు జరగకుండ, విద్యార్థుల ఇష్టం మేరకు కళాశాల ఎంపిక చేసుకోవచ్చని అన్నారు .కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం.అంజాన్ కుమార్ మాట్లాడుతూ.. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లిపు ప్రక్రియ జులై ఒకటి నుంచే ప్రారంభం అవుతుందని, జులై 7వ తేదీ లోపు పూర్తి చేయవలసి ఉంటుందని, జులై 8 నుండి 12 వరకు 5 రోజుల పాటు వెబ్ ఆప్షన్ల ఎంపిక పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని ఈ సేవలు ఉపయోగించుకునే విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ 2024 వారు పొందిన వారికి పొందుపరచిన సెల్ ఫోన్ నెంబర్ను తమవెంట తీసుకురావాలని ఆయన తెలిపారు. ఏపీ ఈఏపీసెట్ 2024 కళాశాల అడ్మిషన్ కన్వీనర్ డాక్టర్. జి.జి.రత్నం సెల్ నెంబర్: 9247848665 ను సంప్రదించవలసిందిగా తెలిపారు, ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సెక్రెటరీ కొత్తపల్లి శివరామరాజు , వివిధ విభాగాల అధిపతులు మరియు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లిపు ప్రక్రియవచ్చిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు
