సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం డి. ఎన్. ఆర్ కళాశాలలో ఉన్నత్ భారత్ అభియాన్ పై అవగాహన కార్యక్రమము నేడు, మంగళవారం ప్రిన్సిపాల్ డా. బి.ఎస్. శాంత కూమారి ఆద్వర్యములో నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రాంతీయ సమన్వయకర్త డా. బి. పావని ఉన్నత్ భారత్ అభియాన్ కార్యక్రమము యొక్క లక్ష్యాలను, ముఖ్య ఉద్దేశములపై పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ కళాశాలల ఉన్నత్ భారత్ అభియాన్ సమన్వయకర్తలకు అవగాహన కల్పించారు. కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ జి. సత్యనారాయణ రాజు ( గాదిరాజు బాబు) మాట్లాడుతూ, ఉన్నత్ భారత్ అభియాన్ ద్వారా విద్యార్ధులు చదువుతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషిచేయాలని పాల్గొన్న వారిని కోరారు. పరిపాలనాదికారి, పి. రామకృష్ణం రాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమములో పాల్గొన్నవారందరూ గ్రామీణ ప్రాంతాలలోని మౌలిక వసతుల కల్పించుటలో తోడ్పడాలని అన్నారు. ఉత్తమ కృషి చేసిన వారికీ ప్రశంస పత్రాలు అందజేశారు.
