సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ప్రముఖ విద్య సంస్థ డి.యన్.ఆర్ కళాశాలలో ఈ నెల 3 వ తేదీ నుండి25 వ తేదీ వరకూ వాలీ బాట్ రెసిడెన్సీయల్ కోచింగ్ క్యాంపు నిర్వహించారు. నేడు, మంగళవారం క్యాంపు ముగింపు కార్యక్రమం కళాశాల లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అద్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ జి.మోజెస్ మాట్లాడుతూ ఈ క్యాంపు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ వారు ఎన్నో సంవత్సరాలగా మా కళాశాలలో ఈ క్యాంపును నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల పాలకవర్గ కార్యదర్సి మరియు కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) పాల్గొన్న క్రిడా కారులను ఉద్దేశించి మాట్లాడుతూ .. మా విద్యాసంస్దలో క్రీడాకారులకు ఫీజు రాయితీ మరియు కొంతమంది దాతల సహాయంతో అత్యాహిక క్రీడాకారుల కు పూర్తి పీజు రాయితీలు ఎన్నో సంవత్సరాలుగా ఇస్తున్నామని అలాగే మాకళాశాల విద్యార్దులు వివిద క్రీడా పోటీలలో విజయాలు సాదిస్తున్నారని అలాగే క్రీడా కోటాలో ఉద్యోగాలు కూడా సాదిస్తున్నారని తెలిపారు. కళాశాల ఉపాద్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాలుగా ఈ వాలీబాల్ క్యాంపును మాకళాశాలలో నిర్వహిస్తున్నందుకు జిల్లా వాలీ బాల్ అసోసియేషన్ సెక్రటరీ డా.జి.వి.పవన్ కుమార్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ క్యాంపుకు ఆర్దిక సహయం అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా వసుద పౌండేషన్ చైర్మన్ , యమ్. వెంకట రామరాజ కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాకళాశాలలో ఆధునిక క్రీడా వసతులు ను భీమవరం పరిసర ప్రాంత లోని విద్యార్దినీ విద్యార్దులు మాకళాశాలలో జాయిన్ అయ్యి ఈ వసతులను ఉపయోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో వసుద పౌండేషన్ తరుపున మంతెన కృష్ణంరాజు, మంతెన రామచంద్రరాజు,కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డా.బి.వి.నరసింహరాజు , కళాశాల అసోసియేషన్ లోని ఫిజికల్ డైరెక్టర్స్. వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *