సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక డీఎన్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ (NSS) యూనిట్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు-2025 నేడు, శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు సమాజం కోసం చేసిన అద్భుతమైన త్యాగాలను స్మరించుకుంటూ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రెండవ పట్టణ సీఐ కాళీ చరణ్ మరియు కళాశాల సెక్రటటరీ & కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) , మరియు కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగ రాజు లు దివంగత ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్ చంద్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఐ కాళీ చరణ్ మాట్లాడుతూ.. “సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ, మన క్షేమం కోసం మేల్కొని ఉండేది పోలీసులే. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన వీర జవాన్ల త్యాగాలు మరువలేనివి” అని కొనియాడారు. భీమవరం పట్టణంలో ఎల్లవేళలా ప్రజలకు శాంతిభద్రతలను కల్పిస్తున్న పోలీసుల సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
