సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక డి.యన్.ఆర్ కళాశాలలో లాంగ్ టర్మ్ ఇంటర్న్ షిప్ కోర్సులకు సంబంధించిన క్లాసులను కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) మరియు వైస్ ప్రెసిడెంట్, గోకరాజు పాండు రంగరాజులు నేడు, మంగళవారం ప్రారంభించారు.కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యస్.శాంత కుమారి మాట్లాడుతూ.. ఈ క్లాసులను టాలెంట్ షైన్ ఇండియా అన్ సంస్థ ద్వారా నిర్వహించబడినవి. దీని ద్వారా కమ్యునికేషన్ స్కిల్, సాప్ట్ స్కిల్, ఎనలాటికల్ స్కిల్స్ల్ లను విద్యార్ధులకు నేర్పి విద్యార్ధులను ప్రతిభావంతులుగా శిక్షణ ఇవ్వనున్నారు. రాబోయే ప్లేస్ మెంట్ రిక్రూట్ మెంట్లో అర్హత సాధించే విధంగా వారికి తర్పీదు ఇవ్వబడుతుందని తెలిపారు. కళాశాలలో వందశాతం ప్లేసే మెంట్ వచ్చే విధంగా కృషి చేస్తున్నామని కళాశాల పరిపాలనాధికారి శ్రీ పి.రామకృష్ణంరాజు తెలిపారు. ఈ కార్యక్రమంతో పాటు డి.యన్.ఆర్ కళాశాల లైబ్రరీ రీడింగ్ రూం లో పాస్ పోర్టు మేళా నుప్రారంభించారు. Unimoni , భీమవరం వారి సహకారంతో రెండు రోజుల పాటు ఈ శిబిరం నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేసారు. . డి.యన్.ఆర్ కళాశాల విద్యార్ధిని విద్యార్ధులు అందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *