సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు ప్రజలకు ఇష్టమైన సంక్రాంతి సంబరాలను పురష్కరించుకొని భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ విభాగము మరియు మహిళా సాధికారిత విభాగము వారు విధ్యార్ధినులకు ముగ్గుల పోటీలను చక్కగా నిర్వహిచారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. ఎస్. శాంత కుమారి గారు విధ్యార్ధినులను ఉద్దేశించి మాట్లాడుతూ .. తర తరాల నుండి తెలుగువారి సాంప్రదాయ పండుగలలో ప్రధానమైనది సంక్రాంతి పండుగ అని, ముగ్గులను కళాత్మకంగా వేసినప్పుడు దానిలో ఒక అంతరార్ధం ఉంటుందని మన సాంప్రదాయానికి ముగ్గులు ఒక ప్రతీక అని అన్నారు. పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైన్ ఆర్ట్స్ సమన్వయకర్త టి.ఎస్.కె. శిరీష, మహిళా సాధికారిత విభాగము అధికారి జి.భవాని, అధ్యాపకులు మరియు విధ్యార్ధినులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమమును నిర్వహించిన వారిని కళాశాల అధ్యక్షలు మరియు కార్యదర్శి గారు అభినందించారు.
