సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా స్ధాయి “వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026” ను ఈ నెల 28 వ తేదీన భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో నిర్వహించడానికి కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఎన్నిక చేసినదని కళాశాల ప్రిన్సిపాల్, జి.మోజెస్ తెలియ చేసారు. దీనికీ సంబందించిన గోడ పత్రికను కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ జి. సత్యనారాయణ రాజు (బాబు), కళాశాల ఉపాధ్యక్షులు జి. పాండురంగ రాజు, కళాశాల పరిపాలనాధికారి పి. రామకష్ణం రాజు, పశ్చిమ గోదావరి జిల్లా యువజన అధికారి, సుంకర రాము గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమములో డి.ఎన్.ఆర్. కళాశాల ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎస్. అనిల్ దేవ్, కె. సోమయ్య పాల్గొన్నారు. కార్యక్రమములో పాల్గొనవలసిన వారు 18 నుండి 25 సంవత్సరాలు పూర్తి అయినవారు అర్హులు.. ముందుగా ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా mybharat.gov.in పోర్టల్ లో తమ పేర్లను నమెదు చేసుకోవాలని, ఈ నెల 28 వ తారీఖున డి.ఎన్.ఆర్ కళాశాలలో నిర్వహించు కార్యక్రమములో గుర్తింపు పొందిన ఏ భాషలోనైనా “50 YEARS OF EMERGENCY: LESSONS FOR INDIAN DEMOCRACY” అనే అంశం పై మూడు నిమిషములు మాట్లాడవలసి ఉంటుంది. ఎంపికైన 10 మందిని రాష్ట్ర స్థాయికి పంపుతారు. నమోదు ప్రక్రియలో సహాయం కొరకు 8179179899, 9441388058 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *