సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లా కేంద్రం భీమవరంలో దశాబ్దాలుగా ప్రతిష్టాకర విద్య సంస్థగా పేరొందిన DNR లో దంతులూరి నారాయణరాజు ఇంజనీరింగ్ కాలేజీ లో ఎన్ ఎస్ ఎస్ విభాగం ‘నేషనల్ సర్వీస్ స్కీమ్ ‘ ప్రాజెక్టు క్రింద 18 ఏళ్ళు వయస్సు నిండిన ప్రతి విద్యార్థి తప్పని సరిగా ఓటు హక్కును పొందాలని.. పలు రకాల నినాదాలతో ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తూ విద్యార్థులు యువ చైతన్య కార్యాక్రమం నేడు బుధవారం ప్రారంభించారు, ఈ కార్యక్రమం లో పాల్గొన్న డి ఎన్ ఆర్ కాలేజీ విద్య సంస్థల పాలకవర్గం వైస్ ప్రెసిడెంట్, గోకరాజు పాండురంగ రాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఒక్క పౌరులు ఓటు హక్కు కలిగి ఉండాలని, దేశానికీ అసలయిన ఆస్థి , భవిత.. చదువు కున్న విద్యార్థులు అని..వారు తప్పని సరిగా ఓటు హక్కు కలిగి ఉండి ఎన్నికలలో ఓటు హక్కు ను వినియోగించుకొని సమర్థులైన అభ్యర్థులను గెలిపించి దేశ భవిషత్తు ను నిలబెట్టవల్సిన బాధ్యత కలిగి ఉండాలి అని, దీనిలో భాగంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పొందేందుకు యువతలో అవగాహనా కల్పించడానికి DNR కాలేజీ ఎన్ ఎస్ ఎస్ యూనిట్ విద్యార్థులు చేప్పట్టిన ఈ చైతన్య కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు, ఈ కార్యాక్రమం లో విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది తో పాటు విజ్ఞాన వేదిక నిర్వాకులు రంగసాయి, తదితరులు పాల్గొన్నారు,
