సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని డి.యన్.ఆర్. కళాశాల ఆవరణలో లో స్థానిక డి.యన్.ఆర్. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాధాకృష్ణ నేత్రాలయ, సౌజన్యంతో నేడు, గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు మెడికల్ క్యాంపు నిర్వహించడమైనది. ప్రజలు విశేషంగా హాజరు అయ్యి వైద్య పరీక్షలు చేయించుకొన్నారు. ఈ క్యాంపు నందు హైదరాబాద్ స్టార్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డా.జి.శశికాంత్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు. డాక్టర్ రవికుమార్ రాజు కంటి పరీక్షలు నిర్వహించి కంటి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. భీమవరం ఒమిక్స్ ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పి.మధుబాబు పర్యవేక్షణలో పేషెంట్లకు ఉచితంగా బి.పి. మరియు షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు లో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.పల్లారావు, కార్యదర్శి పి.సీతారామరాజు, జాయింట్ సెక్రటరి అడపా బాబ్జి, సభ్యులు కొప్పర్తి శ్రీనివాస్, బొక్కా శ్రీనివాస్, డి.మావుళ్ళు, ఆర్.వెంకట్రావు, డి.యన్.ఆర్. కళాశాల పి.డి. నరసింహరాజు, ఆక్వా ఎక్సపోర్టర్ భీమాల శ్రీరామమూర్తి, పి.ఆర్.ఒ. లు శ్రీహరిరాజు, అన్వేష్, మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
