సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డిఎన్ఆర్ కళాశాల 1973-76 బ్యాచ్ B.Sc., CBZ గ్రూప్ పూర్వ విద్యార్థులు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చీఫ్ కో-ఆర్డినేటర్ ఆనందరాజు, మంతెన రామచంద్రరాజు, ప్రమీల ఆధ్వర్యంలో కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలు గా విచ్చేసిన DNR కాలేజ్ అసోసియేషన్ సెక్రటరీ & కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు బాబు , వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు, కళాశాల అల్యూమిని అసోసియేషన్ సెక్రెటరీ బొండా రామకృష్ణారావు రాoబాబు లు మాట్లాడుతూ డిఎన్ఆర్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారని, 50 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులంతా కళాశాలలోనే కలుసుకోవడం అభినందనీయమన్నారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని అలనాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు.
