సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో నేరపరిశోదనలో ఉత్తమ ప్రతిభ చూపించిన వారికి ఇచ్చేటటువంటి ABCD అవార్డులలో ప్రథమ బహుమతి. భీమవరం సబ్ డివిజన్ కు రావడం జరిగింది. నేడు, బుధవారం అవార్డులను గౌరవ ఆంధ్రప్రదేశ్ DGP హరీష్ కుమార్ గుప్తా చేతులమీదుగా పశ్చిమగోదావరి జిల్లా SP అద్నాన్ నయీమ్ IPS అందుకోవడం జరిగింది. ఈ అవార్డు అందుకోవడానికి కారణం ఏమిటంటే.. కొద్దీ నెలలు క్రితం ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఒక ఇంటికి గృహ అవసర సామాగ్రి తో పాటు శవం పార్సిల్ కేసులో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సబ్ డివిజన్ పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేసి మిస్టరీ ఛేదించి అసలు నిందితులను పట్టుకొన్న నేపథ్యంలో వారు చూపిన చొరవ, ప్యూహాత్మక సమన్వయము కేసులో ABCD అవార్డులలో ప్రథమ బహుమతి భీమవరO సబ్ డివిజన్ కు రావడం జరిగింది.
