సిగ్మాతెలుగుడాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని RRDS ప్రభుత్వ కళాశాలలో గతంలో ఎంపీ రఘురామా కృష్ణంరాజు సమకూర్చిన ఎంపీ నిధులతో( MP LADS) తో నిర్మించిన అదనపు తరగతి గదులను నేడు, బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్ని పార్టీల ప్రజా ప్రతిధులు పాల్గొనడం విశేషం, రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు మరియు మాజీ ఎంపీ , ప్రస్తుత ఉండి టీడీపీ ఎమ్మెల్యే ,కనుమూరి రఘురామ కృష్ణంరాజు భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మరియు ఉమ్మడి జిల్లా జనసేన అడ్జక్ష్యులు ,మాజీ మునిసిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవింద రావు (చిన బాబు) తదితర నేతలు పాల్గొన్నారు. అతిధుల సమక్షంలో మోషేను రాజు ను శాలువాతో పూలమాలలతో స్కూల్ సిబ్బంది సన్మానం చెయ్యడం ఆ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా వైసీపీ కి చిందిన మోషేను రాజు రఘురామా.. అంజిబాబు .. చినబాబు మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవడం అందరు ఆసక్తికరంగా గమనించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *