సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లా కేంద్రం భీమవరంలో నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సు లలో ప్రయాణ సాగించే భీమవరం బస్సు స్టాండ్ లో నేటి మంగళవారం సాయంత్రం నుండి నూతనంగా పోలీస్ అవుట్ పోస్ట్ కార్యాలయం ను జిల్లా ఎస్పీ అదానీ నయీమ్ ఆష్మి ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ బస్సు స్టాండ్ ప్రాంతంలో దొంగతనాలు, క్రైమ్ ను అరికట్టడానికి ఇక్కడ పోలీసులు ప్రజలు కు సేవ చెయ్యడానికి అందుబాటులో ఉంటారని దీనితో అసాంఘిక కార్యకలాపాలు కూడా తగ్గుతాయని బస్సు ప్రయాణికులు ఈ పోలీస్ అవుట్ పోస్ట్ కార్యాలయంలో తమ సమస్యలపై పిర్యాదులు చెయ్యవచ్చునని ఎస్పీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.
