సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో అంబెడ్కర్ సెంటర్ నుండి విజయలక్ష్మి థియేటర్స్ వరకు నిర్మించిన రైల్వే అండర్ టర్నల్ బ్రీజ్ ఇటీవల అధికారికంగా వాహనాల రాకపోకల కోసం ప్రారంభించిన విషయం విదితమే.. అయితే మొన్న మన సిగ్మా న్యూస్ లో పేరుకొన్నట్లు దానికి ప్రధాన రోడ్లను అనుసంధానం చేస్తూ నిర్మించవలసిన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అప్రోచ్ రోడ్ల నిర్మాణం జరగక పోవడంతో ఇంకా తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డుపైనే వాహనాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేటి మంగళవారం ఉదయం స్థానిక మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ మరియు అధికారులతో కలసి RUB ను సందర్శించి దానికి అనుసంధానంగా నిర్మించవలసిన రోడ్డు లు శరవేగంగా పూర్తీ చెయ్యాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఇంకా ఈ ప్రాంత పరిసరాలు సుందరంగా శుభ్రత తో ఉండేందుకు చెప్పవలసిన నిర్మాణాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ ఆదేశించారు. ఎంత కాలంలో చేయగలరో కూడా ముందే చెప్పాలని ఆదేశించారు.
