సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సమాజంలో వ్యక్తికీ కిలో బియ్యం ఇస్తే ఆకలి తీరుతుందని, ఇళ్ళు ఇస్తే నిడ వస్తుందని, అదే విద్యను అందిస్తే అతనే అభివృద్ధికి సూత్రదారుడు అవుతాడని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. యువత వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని, అభివృద్ది అనేది విద్య వల్లే సాధ్యమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భీమవరం ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 45వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని మాట్లాడారు. ఇంజనీరింగ్ విద్యార్థులు అవకాశాలు మెండుగా ఉన్నాయని, రానున్న రోజులన్ని యువత కేనని అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు ఎస్ఆర్ కేఆర్ పేరు అలానే ఉంటుందని, 1980 లో 3 బ్రాంచ్ లతో ప్రారంభమై నేడు 12 బ్రాంచ్ లతో 8 వేల మంది విద్యార్థులు, 1000 స్టాఫ్ తో ఒక వెలుగు తీసుకుని వచ్చిందన్నారు. ఈ కళాశాల లో సీట్ లభించడం ఎంతో అరుదని, ఇక్కడ చదివితే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందన్నారు. తదుపరి, కళాశాలలో ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు.కళాశాల ప్రెసిడెంట్ సాగి ప్రసాద్ రాజు, సెక్రటరి సాగి నిషాంత్ వర్మ, డైరెక్టర్ జగపతి రాజు, ప్రిన్సిపాల్ కెవి మురళీ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
