సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టాప్ గ్రేడ్ లలో ఒకటైన SRKR ఇంజనీరింగ్ కళాశాల లో బీటెక్ మొదటి విద్య సంవత్సరం విద్యార్థులకు స్వగతం పలుకుతూ ‘ ప్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో వందలాది నూతన విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ పాలకవర్గం, ప్రిన్సిపాల్, HOD లతో పాటు JNTUకాకినాడ, వైస్ ఛాన్సలర్ కే. మురళి కృష్ణ ముఖ్య అతిధిగా హాజరయి ఉత్సహ పూరిత ప్రసంగం చేసారు. తాను భీమవరం వాసిగా ఇంటర్ వరకు ఇక్కడే చదువుకొన్న విద్యార్థిగా, ఈ ప్రాంత వాసిగా గర్వపడుతున్నానని, తాను ఎన్నో విదేశాలలో ఎన్నో యూనివర్సిటీలలో ప్రసంగించానని అక్కడి విద్య వ్యవస్థలు పరిశీలించానని నా JNTU యూనివర్సిటీ కాకినాడ, పరిధిలో 200 పైగా ఇంజనీర్ కాలేజీలు ఉన్నప్పటికీ వాటిలో ‘టాప్ బెస్ట్ 5’ చెప్పమంటే వెంటనే భీమవరం కాలేజీ పేరు చెపుతానని, మీరుSRKR విద్యార్థినని చెప్పుకొని గర్వపడాలి అని.. ఇక్కడ ఉత్తమ చదువు తో పాటు, ఉద్యోగ అవకాశలు ఎక్కువ ఉన్న ఆధునిక కోర్స్ లు విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయని, ఇంగ్లిష్, స్పానిష్, జర్మన్ వంటి విదేశీ భాషలు నేర్పుతారని, అందుకే విద్యార్థుల తల్లి తండ్రులు కోరుకొనే ప్రఖ్యాత కంపెనీ లు భారీ ప్యాకేజ్ లు సాధిస్తారని అన్నారు. ప్రతి విద్యార్థి తాను ఎంచుకొన్న కోర్స్ లో మాత్రమే ప్రజ్ఞ ఉండదని వారు వేరే రంగంలో కూడా రాణిస్తారని పలువురు ప్రముఖులను ఉదహరించారు.ఏది ఏమైనా ప్రతి విద్యార్థికి క్రమ శిక్షణ తో పాటు తల్లి తండ్రులు వారికీ ఇష్టమైన స్నేహితులు గా ఉంటె ఆ విద్యార్థి మంచి ఫలితాలు సాధిస్తాడని అన్నారు
