సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలోనేడు, బుధవారం ఉదయం స్థానిక 38వ వార్డు డి మార్ట్ వద్ద జీఎస్టీ పన్నుల తగ్గింపుపై స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈసందర్భంగా భీమవరం నియోజవర్గ టిడిపి ఇన్చార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి లు మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాలుగు స్లాబులు ఉన్న జిఎస్టిను రెండు స్లాబులుగా పన్నులను తగ్గించి సెప్టెంబర్ 22వ తేదీ నుండి అమలు చేస్తున్నారని జీఎస్టీ పన్నులు తగ్గింపు వల్ల పేద మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ పన్నులను 18 మరియు 5 శాతానికి తగ్గించడంతో నిత్యవసరాలు, ఎలక్ట్రానిక్స్ భారీగా రేట్లు తగ్గడంపై ప్రజలు సంతోషి స్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ టిడిపి అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము. చల్లబోయిన గోవింద్. కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా. ఆదిలక్ష్మి దేవస్థానం చైర్మన్ భీమనాదం వీరశేషారావు మాజీ కౌన్సిలర్ ఎండి నౌషాద్ పార్టీ నేతలు పాల్గొన్నారు. తదుపరి మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవశకం మొదలైందని ఏపీలో ఆసియాలో అతి పెద్దదయిన ప్రతిష్టాకమైన గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకోవడం రాష్ట్ర నిరుద్యోగ యువతకు అదృష్టమని ఇది యువనేత మంత్రి లోకేష్ అంకుతిత దీక్షకు నిదర్శనం మన్నారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
