సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నేడు, శనివారం ఉదయం నియోజకవర్గ ఇన్చార్జ్ పోలీట్ బ్యూరో, తోట సీతారామలక్ష్మి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం, భీమవరం మండలాలు భీమవరం పట్టణంలోని అనారోగ్యంతో శాస్త్ర చికిత్సలు చేయించుకున్న 12 మంది సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారని వారికీ సీఎం చంద్రబాబు 8 లక్షల రూపాయలు చెక్కుల రూపంలో ఆర్థిక సహాయాన్ని మంజూరుచేసి పేదల ఆరోగ్యానికి భరోసగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి తదితర టీడీపీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
