సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ లో 4 దశాబ్దాలుగా కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధ్వధ్యంలో భీమవరంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర బధిరోన్నత పాఠశాలకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.దాతలు పిల్లల విద్యాసామాగ్రి కి సహకారం అందిస్తూ ఉంటారు. ఇక్కడ చదువుకుంటున్న ముగా, చెవుడు తో విధి వంచితులైన చిన్నారులు పిల్లలును పర్యవేక్షించడానికి ఇక్కడి , ఉపాధ్యాయులు, సిబ్బందికి ఎంతటి సహనం మానవ దృక్పధం ఉండాలి. అటువంటి పాఠశాలలో ఇక్కడి విద్యార్థులకు విద్య బుద్దులు క్రమ శిక్షణ ను, పిల్లల అవసరాలు గుర్తించి వారి ఆలనాపాలనా కుటుంబానికి తండ్రి స్థానంలో పర్యవేక్షించవలసిన ప్రిన్సిపాల్ పి పద్మనాభరాజు ఫై గత కొన్ని నెలలుగా ఎన్నో విమర్శలు తల్లి తండ్రుల పిర్యాదులు వస్తున్నాయి. ఆఖరికి అతనికి విసిగిపోయిన మిగతా అధ్యాపక సిబ్బంది జరుగుతున్నా దారుణాలను మీడియాకు గత 2 రోజులుగా వివరించే ప్రయత్నం జరిగింది.పిల్లలకు పిల్లలకు హాస్టల్లో కదుపునించా భోజనం పెట్టెర్టు., పిల్లలు చెట్ల క్రింద కూర్చుని తింటున్నారని పాఠశాల ఆవరణలో మామిడి, జామ చెట్లు కొట్టించేశారు. వరవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలా పాస్ అవుతారో చూస్తా? అంటూ పిల్లలను బెదిరిస్తూ..నిత్యం ఇలా మానసికంగా వేధింపులు, ఉపాధ్యాయినీలు, మహిళా సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ పాఠశాలలో టెక్నీషియన్ ఉద్యోగి అయిన పి. పద్మనాభరాజు ప్రిన్సిపాల్గా పదోన్నతి పొందారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రిన్సిపాల్ భాధ్యతలు చేపట్టారు. గతంలో టెక్నీషియన్స్ పని చేసి నప్పుడు వేధిస్తే పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఉపాధ్యాయినీలు పేర్కొన్నారు..అయితే అవన్నీ అన్నీ నిరాధార ఆరోపణలు అందరు ఒక్కటయి నన్ను ఇరికిస్తున్నారు అంటూ ప్రిన్సిపాల్ పి. పద్మనాభరాజు నాభరాజు మీడియాకు వివరణ ఇచ్చారు..తదుపరి విచిత్రంగా పాఠశాల సిబ్బందికి, ఉపాధ్యాయినీలకు క్షమాపణ చెప్తూ ప్రిన్సిపాల్ లేఖ వ్రాసారు. తన మానసిక పరిస్థితి స్థిరంగా లేకపోవడంతో తప్పులు చేసినట్లు, ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున మెడికల్ లీవె పై సెలవు పెట్టి వెళ్తానని, వాలంటరీ రిటైర్మెంట్ కోసం వరఖాస్తు చేసుకుంటున్నట్లు, తనను క్షమించాలని ఆ లేఖలో పేర్కొనడం విస్మయం పరచింది. నైతిక విలువల దృష్ట్యా, నిజ నిర్ధారణ కాకుండా ఎవరి ఫోటోలు ప్రచురించడం లేదు.
