సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ VJF క్లబ్ ఆధ్వర్యంలో నేడు, బుధవారం భీమవరం టూ టౌన్ లోని, గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు నోట్ బుక్స్, అంగన్వాడి విద్యార్థులకు స్టీల్ కంచాలు, గ్లాసులు, స్కూల్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణకై మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఆసుపత్రి రిటైర్డ్ సూపర్డెంట్ Dr. వీరాస్వామి , టూ టౌన్ S.I.రమేష్ లు విచ్చేసి విద్యా సామాగ్రి పంపిణీ చేసారు. తదుపరి వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు విద్యా ప్రోత్సాహం అందించడానికి V.J.F. క్లబ్ అధ్యక్షులు పర్రిపాటి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం స్ఫూర్తిదాయకమని, క్లబ్ సభ్యులను అభినందించారు. క్లబ్ అధ్యక్షుడు పర్రిపాటి శ్రీను మాట్లాడుతూ.. మా క్లబ్ ప్రారంభమైన తక్కువ సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, తాజాగా.. 70 మంది విద్యార్థులకు సంపూర్ణంగా నోటి బుక్స్ కిట్లు, అంగన్వాడి పిల్లలకు స్టీల్ గ్లాసులు, కంచాలు, పలకలు, బిస్కెట్లు, చాక్లెట్లు, మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగసూరి మురళి , క్లబ్ కార్యదర్శి సబ్బిశెట్టి శ్రీనివాస్ గణేష్, కోశాధికారి సంక అనంత గోపాలం, సమయమంతుల నాని, ఆలపాటిహరి నారాయణ, సమయ మంతుల శ్రీయ,ఉప్పల నరసింహమూర్తి, ఆలపాటి భాస్కరరావు,తదితరులు పాల్గొన్నారు.
