సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరం పట్టణంలోని పదవ వార్డులో రూ నలభై లక్షల నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి నేడు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత నాలుగేళ్ల కాలంలో భీమవరం పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రతి వార్డులో కూడా ప్రజల సూచన మేరకు, వారి సలహాలు మేరకు సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నామని అన్నారు. భీమవరంలోని ప్రతి వార్డులో కూడా పూర్తిస్థాయిలో అంతర్గత రోడ్లు నిర్మిస్తున్నామని అన్నారు. అభివృద్ధి అంటే భీమవరం నియోజకవర్గమని ఇందులో ఎటువంటి సందేహంకు తావులేని ప్రగతి సాధించామని, ఇంకా మరిన్ని అభివృద్ధి పనులకు సంబంధించి కోట్లాది రూపాయల నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనల పంపడం జరిగిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *