సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లా రతిభాన్‌పూర్‌ గ్రామంలో భోలే బాబా అనే ఆధ్యాత్మికవేత్త గత మంగళవారం నిర్వహించిన కార్యక్రమం లో తీవ్ర తొక్కిసలాట జరిగి 116 మంది ప్రాణాలు కోల్పోవడం దేశ చరిత్రలో ఒక విషద ఘట్టంగా నమోదు అయ్యింది.చనిపోయినవారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలేనని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎదో దైవ భక్తితో మంచి మాటలు విందామని ప్రవచనానికి వెళ్తే.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో 116 మంది ప్రాణాలు పోయాయి! 150 మందికి పైగా గాయపడ్డారు. కేవలం 5000 మంది మాత్రమే పట్టే చోట.. 20వేల మంది చేరటంతో పాటు స్వామిజి పాద స్వర్శ కోసం పోటీ పడటం తో త్రొక్కిసలాట పరిణామం ఇది. గాయపడిన వారికీ సరైన వైద్యం కూడా అందలేదని అందుకే మృతులు పెరిగారని ఇది యోగి ప్రభుత్వ వైఫల్యం అంటూ ప్రభుత్వం దిగి పోవాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా దీనికి కారణం అయినా భోలే బాబా కు యూపీ లోని అన్ని పార్టీల కీలక నేతలు భక్తులే.. .యూపీలోని కిషన్‌గంజ్‌ జిల్లాకు చెందిన భోలే బాబా.. గతంలో పోలీసు శాఖ నిఘా విభాగంలో 18 ఏళ్లపాటు పనిచేసి, ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఆధ్యాత్మిక గురువుగా మారారు. స్థానికులు ఆయనను ‘నారాయణ సాకార్‌ హరి’.. ‘సాకార్‌ విశ్వ హరి బాబా’ అనే పేర్లతో పిలుచుకుంటారు. ప్రతి మంగళవారం ఆయన నిర్వహించే సత్సంగానికి ప్రజలు వేలాదిగా హాజరవుతుంటారు.అందులో భాగంగానే నిన్నటి దారుణం జరిగింది. ఫేస్‌బుక్‌లోనే ఆయనకు 3 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *