సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నాగార్జున, మహేష్ బాబుతో పలు హిట్ చిత్రాలు, ఇటీవల సామాజ వరగమన వంటి హిట్ సినిమాలు నిర్మించిన అనిల్ సుంకర, అఖిల్ అక్కినేనితో నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా ‘ఏజెంట్’ ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు 30 కోట్లకు కొనుక్కున్న వైజాగ్ సతీష్ అనే డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు అనిల్ సుంకర మీద న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నాడు. నిర్మాత అనిల్ సుంకర ఇటీవల నిర్మించిన ‘భోళాశంకర్’ సినిమా విడుదలకు ముందు తనకి కొంత డబ్బు ఇస్తామన్నారు అని, కానీ వాళ్ళు ఇప్ప్పుడు ముఖం చాటేశారని డిస్ట్రిబ్యూటర్ సతీష్ ఆరోపణ. అందుకే ‘భోళాశంకర్’ నిర్మాత అనిల్ సుంకర 30 కోట్లు తీసుకుని మోసగించారు, అందుకే ఈ శుక్రవారం విడుదల అవుతున్న ‘భోళాశంకర్’ పై కోర్టులో కేసు వేశాను అని మీడియా ముఖంగా ప్రకటించారు.
