సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కంత్రి, బిర్లా వంటి హిట్ సినిమాలు తరువాత శక్తి , షాడో వంటి భారీ ప్లాప్ సినిమాలతో వెనుకబడిన మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఆగస్టు నెల 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు సర్వం సిద్ధమైంది. మినీ మెగాస్టార్ రామ్ చరణ్ రేపు గురువారం సాయంత్రం 4:05 గంటలకు ‘భోళా శంకర్’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ట్ ప్రకటించారు. రేపు చూద్దాం ట్రైలర్ ఎలా ఉండబోతుందో.. మరి మెహర్ రమేష్ ‘మెగా’ అభిమానుల అంచనాను అందుకొంటాడా?చిరంజీవి నమ్మకాన్ని నిలబెడతాడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *