సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ గా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి .. ఆ సినిమా విడుదలైన కేవలం 7 నెలల గ్యాప్‌తో ఇప్పుడు ‘భోళా శంకర్’ అంటూ నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కంత్రి, బిర్లా సినిమాల విజయాలు తరువాత శక్తి, షాడో సినిమాల పరాజయాలతో కనపడకుండా పోయిన మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే వాస్తవం మాట్లాడుకొంటే .. మెహెర్ దర్శకుడు అనో..? మరి ఎందు చేతనో ఈ సినిమాపై అంచనాలు తక్కువగా ఉన్నాయి. అందుకే గతంలో మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ తాలూకు ఓపెయినింగ్స్ కోలాహలం కనపడలేదు.ఇక భీమవరంలో ‘భోళా శంకర్’ సినిమా నేటి ఉదయం 8 గంటలకు ప్రత్యేక ఆటలు 7 థియేటర్స్ లో ప్రదర్శించారు. సినిమా టాక్ బట్టి మెగా అభిమానులను నిరాశపర్చలేదు. సినిమాలో భారీ హైలైట్స్ లేకపోయినా సినిమా బాగుంది అంటున్నారు. మెగా ఫ్యామిలీకి కోల్‌కతా కల్సివస్తుందనే సెంటిమెంట్ ఉంది. ఇంటర్వెల్ ముందు తరువాత సన్నివేశాలు హైలైట్.. అభిమానులకు అరుపులే.. చిరంజీవి వయస్సు తగ్గినట్లు కనిపించారు. తమన్నా తో కలసి స్టెప్స్ వైరిటీగా వేశారు. అయితే సాంగ్స్, ఫైట్స్ ఇంకాస్త బాగుండాల్సింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. దాదాపు జబర్దస్త్ కామిడీయన్స్ అందరు కనిపిస్తారు. చిరు నుండి చెల్లెలు సెంటిమెంట్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు కోరుకొనే కామిడి నుండి యాక్షన్ సీన్స్ కు మెహర్ రమేష్ పెద్ద పీట వేశారు అని పబ్లిక్ టాక్..అయితే వచ్చే సోమవారం ఈ సినిమా విజయం స్థాయి ఏమిటో అర్ధం అవుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *