సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ మూవీ గత నెల అంటే ఆగస్టు 11న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. అయితే దారుణ పరాజయం అందుకొంది. అయితే ఇప్పు డు ఈ చిత్ర డిజిటల్ హక్కులు దక్కిం చుకున్న నెట్ ఫ్లెక్స్ ఓటీటీ రిలీజ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న తేదీలో కాస్త మార్పు చేసి సెప్టెంబరు 15నే స్ట్రీమింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. మెగాస్టార్ సినిమా థియేటర్స్ లో చూడకపోయిన ఓటిటి లో కచ్చితంగా చూడాలని అనుకోని ప్రేక్షకులు ఉంటారా? వారి ఆత్రుత ను మరో వారంరోజులలో బోళా శంకర్ తీర్చేసే అవకాశం ఉంది.
