సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంగళగిరి పట్టణంలోని కరూర్ వైశ్యా బ్యాంకులో గత రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన 9 కోట్ల 20 లక్షల గోల్డ్ గోల్మాల్.. విషయం పై పట్టణ పోలీసులు. ఇందులో ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్న రాజశేఖర్ రెడ్డి ప్రకాష్ మదన్ కుమార్ తో పాటు మరో 47 మంది ఖాతాదారులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. గత రెండు నెలల క్రితం కరూర్ వైశ్యా బ్యాంకులో 47 మంది ఖాతాదారులు నాణ్యత తగ్గిన బంగారాన్ని కుదువ పెట్టి 9 కోట్ల 20 లక్షలు రుణం పొందినట్లు ప్రస్తుతం మేనేజర్ ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో గోల్డ్ అప్రైజర్ మదన్ కుమార్ తో పాటు మరో ఇద్దరు ప్రమేయం ఉన్నట్లు నూతన మేనేజర్ ఫిర్యాదు చేసారు. ఇందులో అసలు ట్విస్ట్ ఏమిటంటే తొమ్మిది కోట్ల 20 లక్షల గోల్డ్ గోల్మాల్ విషయంలో కరూర్ వైశ్యా బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న చుండూరు మదన్ కుమార్ ప్రధాన పాత్ర ఉన్నట్లుగా అతను పరారీలో ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. అయితే అతని అదృశ్యం వెనుక కుట్ర ఉందని ఆయన తల్లి పోలీసులకు పిర్యాదు చేసింది. అదే బ్యాంకులో తాము కుదువ పెట్టుకున్న బంగారం పరిస్థితి ఏమిటో అని పలువురు బ్యాంకు కస్టమర్స్ ఆందోళన చెందుతున్నారు అతని అదృశ్యం వెనుక కుట్ర ఉందని ఆయన తల్లి పోలీసులకు పిర్యాదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *