సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో శుభకార్యాల సీజన్ నేపథ్యంలో..బులియన్ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో మంచి ఊపుమీద బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న శుక్రవారం 10 గ్రాములకు ఒక్కసారిగా రూ.600 మేర పెరిగిన బంగారం ధర నేడు, శనివారం కూడా స్వలాపంగా 30 రూ పెరిగింది . అక్షయ తృతీయ వేళ బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. నేడు, శనివారం దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,660 లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,810కి చేరింది. ఇక వెండి ధర మాత్రం తగ్గింది. నేడు కిలో వెండి ధరపై రూ.1100 మేర తగ్గి రూ.78,500కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..హైదరాబాద్, విజయవాడ లలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,660.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,810 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.
