సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ( BIG BOSS 8) సరికొత్త 8వ సీజన్ గత రాత్రి స్టార్ మా ఛానెల్ లో నాగార్జున హోస్ట్ గా మంచి హడావిడి తో కనివిని ఎరుగని అందమైన హౌస్ సెట్ లో .ప్రారంభం అయ్యింది. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ అక్కినేని నాగార్జున ఈ లాంఛింగ్ షోని యువ హీరో రానాతో తో కలసి ఆసక్తికరంగా ప్రారంభించారు. సరిపోదా శనివారం ప్రమోషన్ కోసం వచ్చిన హీరో నాని కొద్దీ సేపు సందడి చేసారు. హౌస్‌లోకి తన హుషారైన యాంకరింగ్ తో కింగ్ నాగార్జున మొత్తంగా 7 పెయిర్స్‌ని .. అంటే 14 మందిని పంపించారు. అయితే ఈసారి హౌస్ లో ఇద్దరు ముగ్గురు తప్ప నిజమైన సెలబ్రెటీలు ఎవరు లేరు.. ఆ పెయిర్స్ వివరాలివే..ఈ సీజన్ ఫస్ట్ కంటెస్టెంట్‌గా యష్మీ ఎంట్రీ ఇచ్చింది. బడ్డీ కాన్సెప్ట్‌లో భాగంగా.. ఆమెకు బడ్డీగా, అలాగే రెండో కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు నిఖిల్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. మూడో కంటెస్టెంట్ ‘పెళ్లిచూపులు’ విష్ణు అలియాస్ అభయ్ నవీన్‌ను ఆహ్వానించారు. తనకు వచ్చిన బడ్డీ కార్డులో సీరియల్ నటి ప్రేరణ కలసి హౌస్ లోకి వెళ్లారు. నాగ్ ఐదవ కంటెస్టెంట్‌గా లాహిరి లాహిరి లో హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. అతనికి బడ్డీగా సోనియా 6వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి పంపించారు. 7వ కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క ఎంట్రీ ఇస్తే.. ఆమె బడ్డీగా ఈ మధ్య వార్తలలో బాగా వైరల్ అవుతోన్న శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చారు. ఇక సిక్త్ పెయిర్ 11వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు పృథ్వీరాజ్, అతని బడ్డీగా యాంకర్ విష్ణు ప్రియ ను హౌస్‌లోకి పంపించారు.హౌస్‌లోకి వెళ్లే లాస్ట్ పెయిర్ అంటూ.. కింగ్ నాగ్ నైనికను పిలిచారు. బడ్డీ కార్డు ద్వారా 14వ కంటెస్టెంట్‌గా వరంగల్ కుర్రాడు నబీల్ ఆఫ్రీది స్టేజ్ పైకి వచ్చారు. ఈ పెయిర్‌ని హౌస్‌లోకి పంపిన అనంతరం దర్శకుడు అనిల్ రావిపూడిని హౌస్‌లోకి పంపించి ఓ ఫ్రాంక్ ట్విస్ట్ ఇచ్చారు. అనంతరం లాస్ట్‌గా వెళ్లిన ఇద్దరి కపుల్స్‌తో గేమ్ ఆడించి.. ఓడిన వారికి బ్యాడ్ న్యూస్ అంటూ ‘జీరో ప్రైజ్ మనీ’ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు.
