సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలో ఈ సీజన్ లోనే ఎక్కువ స్థాయిలో నేడు, సోమవారం ఉదయం 9 గంటలు కు కూడా ప్రధాన రహదారులు పూర్తీ మంచు దుప్పటిలో చిక్కుకొని వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. ( ఫై తాజా దృశ్యం విష్ణుపూర్ కు వెళ్లే దారి ) భీమవరం పట్టణ నడిబొడ్డున ప్రధాన రహదారులు సైతం యన్మదురు డ్రైన్ వంతెన, జెపి రోడ్డు మంచు తెరలమాటున ఒదిగిపోయాయి.ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారికి చలి పులి వెంటాడుతున్న అనుభూతిని కలిగించింది. కేవలం 20 అడుగుల దూరం దాటితే ఏ వాహనం వస్తుందో కూడా తెలియనంతగా మంచు దట్టంగా అలముకుంది. ఒక ప్రక్క వాయుగుండ ప్రభావం మరో ప్రక్క చలి తీవ్రతో ఇండ్లలో నివసించే వారికీ ముఖ్యముగా వృద్దులు, చిన్నారులు, ఉబ్బసం ఉన్నవారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నేడు మధ్యాహ్నం ఎండ వచ్చిన చలి తీవ్రత తగ్గలేదు.
