సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నో అడ్డంకులు, ట్రోల్స్ దాటుకొని మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్.. కన్నప్ప నేడు శుక్రవారం పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియ‌న్ సూప‌ర్ స్టార్స్ ప్ర‌భాస్‌, అక్షయ్ కుమార్, మోహాన్ లాల్ వంటి మ‌హా మ‌హులు న‌టించిన‌ క‌న్న‌ప్ప (Kannappa) చిత్రం కధ విషయానికి వస్తే.. ఇది పుణ్య క్షేత్రం కాళహస్తి కి చెందిన పురాణ కధ. సింపుల్ గా చెప్పాలంటే గత జన్మలో శివుడు తో విలువిద్యలో పోటీ పడి గొడవకు దిగిన అర్జునుడే మరో జన్మలో తిన్నడు గా జన్మించడం నాసికుడు గా దేవుని నమ్మని మొండివాడు గిరిజనుడు తిన్నడు శివ భక్తునిగా మారిపోవడం.. దానికి శివుడు పెట్టిన పరీక్షలు .. ఆఖరికి శివాలయంలో శివలింగానికి కంటికి గాయం అయ్యిందని భావించిన తిన్నడు తన రెండు కన్నులు స్వామికోసం ఇవ్వడానికి సిద్ద పడటం దానితో శివుడు సాక్షాతుకారం పొందటం ఇది టూకి గా కధ . దీనికి భారీ తనం ఆపాదించడానికి కోడె గూడెం నాయకులూ వారి మధ్య యుద్దాలు అంటూ ఎన్నో ఉపకథలుసృష్టించి సినిమా తీశారు అనుకోండి.. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే..మహాభారత్ వంటి టివి సీరియల్ అత్యద్భుతంగా తీసిన ముకేశ్ కుమార్ సింగ్ కన్నప్ప తో తన దర్శకత్వ ప్రతిభ నిరూపించుకొన్నారు. సినిమా ఆరంభ‌మ‌మే శివ‌ పార్వ‌తుల మీద ( అక్షయ్ కుమార్, కాజల్) ప్రారంభ‌మై, తిన్న‌డు, అక్క‌డి గ్రామాలు, గ్రూపుల గురించి చూయించార‌ని పేర్కొంటున్నారు. ప్ర‌తీ ప్రేమ్ విజువ‌ల్‌గా, టెక్నిక‌ల్‌గా చక్కగా తీశారు. అంతేగాక ఫ‌స్టాప్‌లో కాస్త సాగదీతగా కనిపిస్తుంది. మోహ‌న్ లాల్‌ కనిపించేది కొద్దీ సేపే అయిన అదరకొట్టాడు.. ఇక , మోహ‌న్ బాబుల వయస్సు పెరిగినకూడా.. డైలాగ్స్ చెప్పడం లో తన సత్త్త చూపారు. హీరోయిన్ పాత్ర పరిధి తక్కువే.. ఇక సెకండాఫ్‌లో ప్ర‌భాస్ ఎంట్రీతో సినిమా రేంజ్ బాగా పెరిగిపోయింది. ప్రభాస్ అభిమానుల ను అలరించేలా సుమారు 22 నిముషాలు ఆయన సన్నివేశాలు ఉన్నాయి. ఆపై చివ‌రి 30 నిమిషాలు సినిమాకు ఆయువు పట్టు. ఎక్కడ పట్టు తప్పదు.. మంచు విష్ణు అక్కడే శివభక్తుడుగా మారిపోయి తన వాహభావాలతో ప్రేక్షకులను మెప్పించాడు. న్యూజిలాండ్ అందాలు సినిమాకు సెట్ కాకపోయిన అదో అనుభూతి.. కెమెరా బాగుంది. అధేవిధంగా సినిమాకు సంగీతం హైలైట్.. బ్యాగ్రౌండ్ స్కోర్‌, పాట‌లు సినిమా స్థాయిని పెంచేలా ఉంటుంది. ట్రోల్స్ ప్రభవంతో మొత్తానికి తక్కువ అంచనాలతో వెళ్లిన ప్రేక్షకులను కన్నప్ప బాగానే మెప్పిస్తున్నాడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *