సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భక్త కన్నప్ప’చిత్రం మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఇటీవల ఈ చిత్రాన్ని శ్రీకాళహస్తి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించనున్నారు. 150 కోట్ల పైగా బడ్జెట్ అంటున్నారు. గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు భక్తకన్నప్ప గా సినీ చరిత్రలో నిలిచిపోయేలా నటించగా కీలకమైన శివుడు పాత్రలో ఆనాటి బాలయ్య మెప్పించారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి తన పెద్దనాన్న కృష్ణంరాజు కు పేరు తెచ్చిన భక్త కన్నప్ప పాత్రలో మంచు విష్ణు చేస్తుండగా.. భీమవరం బ్రాండ్.. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఈ చిత్రంలో తన కటౌట్ కు బాగా సూటయ్యే పరమ శివునిగా కీలక పాత్ర పోషించనున్నారని, మిత్రుడు విష్ణు కోసం తన కుటుంబానికి ఆత్మీయుడు అయినా మోహన్ బాబు ఫై ఉన్న గౌరవం కోసం ఒప్పుకొన్నారని తెలుస్తుంది. ఈ విషయంపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. ‘హర హర మహాదేవ్‌’ అని ట్వీట్‌ చేశారు.. ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్‌ ఈశ్వరుడిగా కనిపించనున్నా ఈ చిత్రంలో నుపుర్‌ సనన్‌ కథానాయిక. కన్నప్ప వృత్తాంతం 2వ శతాబ్దంలో జరిగిందని, ప్రస్తుతం అక్కడి పరిసరాల్లో సినిమా తీయడం వీలు కాదు. అందుకోసం ఈ చిత్ర నిర్మాణానికి ఆర్నెలపాటు న్యూజిల్యాండ్‌కు వెళ్తున్నాం. కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అని మంచు విష్ణు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *