సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ మధ్యకాలంలో విచిత్రంగా ఏపీలో బస్సు ప్రమాదాలు ప్రతి రోజు సర్వ సాధారణంగా మారిపోయిది. ముఖ్యంగా ట్రావెల్స్ వాహనాలు దగ్ధమవుతున్నాయి. అయితే తాజాగా ఏపీలో మరో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా పుట్లూరులో గత బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. 30 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా ప్రమాదాన్నిగేర్ బాక్స్‌లో శబ్దాల రూపంలో ముందే గమనించడం తో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *