సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాలో తాజగా పరువు హత్య జరిగింది. మండపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వేములపల్లికి చెందిన సూర్య ప్రకాశ్, సంధ్యలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు వారి ప్రేమకు అభ్యంతరం చెప్పారు. దీంతో గత గురువారం అన్నవరంలో సూర్య ప్రకాశ్-సంధ్య వివాహం చేసుకున్నారు.పెళ్లి జరిగిన కోద్ది గంటలకే ఈ విషయం తెలిసి సంధ్య సోదరులు.. సూర్య ప్రకాశ్ ఇంటికి వెళ్లి రాళ్లతో దాడిచేసి నూతన వరుడు సూర్య ప్రకాష్ ను దారుణంగా చంపేశారు. పారాణి ఆరకముందే కొద్దీ గంటలలో భర్తను కోల్పోయిన సంధ్య ప్రస్తుతం రాయవరంలోని డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేస్తున్నారు. వేములపల్లి‌కి చెందిన వస్త్ర వ్యాపారి కుమారుడు సూర్య ప్రకాశ్. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడమే హత్యకు కారణమయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *