సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో రేపు ఆదివారం ఏసుప్రభు జన్మదినం క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఒక రోజు ముందుగానే నేటి శనివారం నుండి పట్టణంలో పండుగ సందడి మొదలయింది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం స్థానిక పోలీస్ సిబ్బంది గునుపూడి లోని శాసనమండలి కొయ్యే మోషేను రాజు ఇంటి వద్ద పోలీస్ సిబ్బంది నిర్వహించిన క్రిస్మస్ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు కేక్ కట్ చేసి సిబ్బందికి స్వయంగా తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. దేవుని పుత్రునిగా పేమ ను అందరికి పంచమన్న క్రీస్తు బోధనలను అందరికి ఆచరణీయమని , క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు
