సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో ఎండల తీవ్రత పెరిగింది. అయితే గోదావరి జిల్లాలలో ఇంకా ఉదయం రాత్రి మంచు తెరలు కనిపిస్తూనే ఉండటం ప్రజలకు కాస్త ఊరట.. మరో ప్రక్క ఎండలు దంచి కొడుతున్నాయి. అలాంటి వేళ వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా వచ్చే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో. అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణలో వచ్చే5రోజుల పాటు అంటే.. మార్చి 17నుంచి 21వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *